వివాహ వేడుకకు హాజరై.. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి లోకేశ్‌

  • ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు వేమూరు రవికుమార్ కుమారుడి వివాహ వేడుక
  • విజయవాడలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేశ్‌
  • వధూవరులు కిరణ్, పుష్పలతలను ఆశీర్వదించిన మంత్రి
  • అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ శనివారం విజయవాడలో పర్యటించారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు (ఏపీఎన్ఆర్టీ) సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ వేమూరు రవికుమార్ కుమారుడి వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు.

అంతకుముందు ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రి లోకేశ్‌, కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు లోకేశ్ ‌ను వేదాశీర్వచనాలతో దీవించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఇంద్రకీలాద్రి దేవస్థానంలోనే జరిగిన డాక్టర్ వేమూరు రవికుమార్ కుమారుడు కిరణ్ వివాహ మహోత్సవానికి మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు. నూతన వధూవరులు కిరణ్, పుష్పలతలను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


Nara Lokesh
AP Minister Nara Lokesh
Indrakilaadri
Kanakadurga Temple
Vemuru Ravi Kumar
Vijayawada
APNRT
Wedding Ceremony
Andhra Pradesh

More Telugu News